కరోనా బీభత్సం కారణంగా కృష్ణా జిల్లా గుడివాడ రవాణా శాఖ కార్యాలయం పూర్తిగా ఖాళీ అయింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఇద్దరు మినహా మిగిలిన అందరికీ కొవిడ్ సోకింది. గత రెండు రోజులుగా ఖాళీ కుర్చీలే అక్కడ దర్శనమిస్తున్నాయి.
ఇదీ చదవండి : ఎయిర్పోర్ట్ నుంచి 300 మంది ప్రయాణికులు పరార్!
కార్యాలయానికి రావడానికి వాహన చోదకులు, ప్రజలు భయపడుతున్నారు. తమకెక్కడ వైరస్ అంటుకుందో అని.. గత వారం రోజులుగా వివిధ పనుల నిమిత్తం వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్... ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు