ETV Bharat / state

తాగు నీటి కష్టాలు... చుక్క నీటి కోసం కిలోమీటర్లు పయనం - corona cases in krishna dst

మంచినీటి పైప్ లైన్ లీక్ కావటంతో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. లాక్ డౌన్ సమయంలోనూ మహిళలు కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

drinking water problem in krishna dst  pedakallepali village

author img

By

Published : May 10, 2020, 5:08 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో తాగునీటి కోసం పూర్వకాలం పెద్ద చెరువు ఏర్పాటు చేసుకున్నారు. ప్రకాశం బ్యారేజి ద్వారా వచ్చే నీళ్లను ఫిల్టర్ చేసి కుళాయిలకు ఎక్కించేవారు. ఈ క్రమంలో చెరువు దగ్గర నుంచి ట్యాంకుకు ఎక్కే పైప్ పాడైపోగా.. నీటి సమస్య తలెత్తింది.

అప్పటినుంచి తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ లీకులు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. తాగునీటికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:

ఆ తల్లుల గర్భశోకం తీర్చలేనిది : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.