ETV Bharat / state

కరోనా ప్రభావం.. కళ తప్పిన దీపావళి కొనుగోళ్లు

సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు నుంచే బాణాసంచా విక్రయ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఈసారి మాత్రం వినియోగదారుల్లో ఉత్సాహం తగ్గింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం.. పండగ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడమే దానికి ప్రధాన కారణం.

diwali-purchases-are-down-at-nandigama-krishna-dist
కరోనా ప్రభావంతో.. కళ తప్పిన దీపావళి కొనుగోళ్లు
author img

By

Published : Nov 13, 2020, 4:29 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో దీపావళి సంబంధిత సామగ్రి విక్రయాలు కళతప్పాయి. గతేడాది 25 బాణాసంచా విక్రయ దుకాణాలు ఉండగా ఈ సారి కేవలం ఆరు మాత్రమే ఏర్పాటుచేశారు. టపాసులు, పువ్వులు, తదితర పండగ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో వ్యాపారాలు దిగాలు పడ్డాయి.

అకాల వర్షాలతో రైతుల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం పండగ చేసుకోవడానికి వెనకాడుతున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి, ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు ప్రజల్లో పండగ వాతావరణం లేకుండా చేశాయి. ఫలితంగా విక్రయాలపై ప్రభావం పడుతోంది.

ఇదీ చదవండి:

తెలంగాణలో టపాసులపై నిషేధంపై స్టే ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.