ఉపాధి హామీ బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఉపాధి హామీ పథక రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వీరంకి వెంకటగురుమూర్తి మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కృష్ణాజిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనుల నిమిత్తం 235కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లింపు విషయంలో చేస్తున్న ఆలస్యం కారణంగా పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బకాయిలు విడుదల చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతోపాటు రాష్ట్రప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి