జూలై 30న పింఛన్లకు సంబంధించి రూ.2800 కోట్లు డైరెక్ట్ గా ఎన్జీవోల అకౌంట్లలోకి వెళ్లిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రూ.1400కోట్లకు బదులు రూ. 2,800కోట్లు బదిలీ చేశారని దేవినేని ఉమా అన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారుల బాధ్యతా రాహిత్యం వల్లే పొరపాటు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ నుంచి వెళ్లిపోయిన డబ్బు తిరిగి వెనక్కు వస్తుందా లేదా అని ప్రశ్నించారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సజ్జల ఆదేశాలతోనే అడ్డగోలుగా ఆర్థికశాఖ నుంచి చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు.
అచ్చెన్నాయుడికి కరోనా రావడానికి ప్రభుత్వమే కారణమని దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం దుర్మార్గంగా అటూఇటూ తరలించడం వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను వేధిస్తోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు