రైతు భరోసా కేంద్రాల్లో రైతులను పట్టించుకోవటం లేదని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయట్లేదని..,తెదేపా బయ్యర్లను పిలిపిస్తే వారిపై వైకాపా నేతలు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పరిధిలోని సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించలేకపోతున్నారని దుయ్యబట్టారు. సుబాబులు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి