ETV Bharat / state

'ప్రభుత్వ అనాలోచిత చర్యలు..దిక్కుతోచని స్థితిలో మల్లె రైతులు' - దేవినేని తాజా వార్తలు

కరోనా లాక్​డౌన్ వల్ల మార్కెట్​లో ధర లేక ఇబ్బందులు పడుతున్న మల్లె రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశంలోనే పేరుగాంచిన కృష్ణా జిల్లా చండ్రగూడెం మల్లె రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆక్షేపించారు.

devineni uma comment son Jasmine farmers
దిక్కుతోచని స్థితిలో మల్లె రైతులు
author img

By

Published : Jun 7, 2021, 3:58 PM IST

వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశంలోనే పేరుగాంచిన కృష్ణా జిల్లా చండ్రగూడెం మల్లె రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మల్లె ధరలపై స్పష్టమైన విధానం అమలు చేయకపోవడంతో సీజన్​లో సైతం అరకొర ధరలకు అమ్ముకొని రైతులు పెట్టుబడులు కూడా పొందలేక పోతున్నారని ఆయన వాపోయారు. కరోనా లాక్​డౌన్ వల్ల మార్కెట్​లో ధర లేక ఇబ్బందులు పడుతున్న మల్లె రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ధాన్యం కల్లాల పరిశీలన

చండ్రగూడెంలో ధాన్యం కల్లాలను దేవినేని పరిశీలించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయకపోవటంతో కల్లాల్లోనే ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోయాయని మండిపడ్డారు. 1121 ధాన్యం ప్రభుత్వం చెబితేనే రైతు పండించారన్న దేవినేని.., మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

Anandayya Medicine: ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.