పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు అనుమతిచ్చాక ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడి వెనక్కితగ్గారని.. మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశమైన ముఖ్యమంత్రి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంపించారని విమర్శించారు. గవర్నర్ను కలిసి.. అసెంబ్లీని రద్దు చేయాలనుకున్న ముఖ్యమంత్రికి సుప్రీం తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
అన్నీ జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పీకే టీం ద్వారా సమాచారం తెలుసుకున్న సీఎం.. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండటంతో అసెంబ్లీ రద్దును వెనక్కి తీసుకున్నారని దేవినేని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని తెదేపాలోకి ఆహ్వానించారు దేవినేని.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు.. తెదేపా మేనిఫెస్టో విడుదల