ETV Bharat / state

విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై విద్యాశాఖ సర్వే - Education Department latest news

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గుదలపై సర్వే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవ్వగా విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని గుర్తించారు.

విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టనున్న విద్యాశాఖ

author img

By

Published : Nov 11, 2020, 10:39 PM IST

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమైనప్పటి నుంచి హాజరు శాతం తక్కువగా ఉందని గుర్తించారు. ఇందుకు గల కారణాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శిక్షణ కేంద్రం డైరక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్​ఈ, సీటీఈ, డైట్ ప్రిన్సిపల్స్ కలిపి మెుత్తం పది మందిని సమాచార సేకరణ కోసం పంపనున్నారు.

ప్రతి ఒక్కరూ వేరువేరు గ్రామాల్లో ఉన్న 3 ఉన్నత పాఠశాలలను సందర్శించనున్నారు. బృందం సందర్శించే పాఠశాలల్లో రెండు జిల్లా పరిషత్, లేదా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రైవేట్ పాఠశాల ఉండాలని సూచించారు. ఈ సర్వే సమాచారం 12వ తేదీలోగా పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీచదవండి

రాష్ట్రంపై తగ్గుతున్న కొవిడ్ ప్రభావం.. తాజాగా 1732 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.