రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారందరికీ పరిహారం ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. తిరుపతి రుయాలో 11 మందే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. అనంతపురం, విజయనగరంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు.
విచారణకు ఆదేశించాలి : సీపీఐ రామకృష్ణ
కదిరి, కర్నూలులోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురం, అమలాపురంలో సైతం ప్రాణ వాయువు లేక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కొరత మృతులందరికీ రూ.10 లక్షలు చొప్పున సర్కారే పరిహారం అందివ్వాలన్నారు. ఆక్సిజన్ సరఫరా లోపంతో జరిగిన మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి : నాలుగున్నర గంటల ఆలస్యం.. గాల్లో కలిసిన 11 ప్రాణాలు !