కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోలాహలంగా శక్తి పటాల జమ్మి పూజ నిర్వహించారు. నవరాత్రులు చివరి రోజు ప్రధాన శక్తిగుడి శక్తి పటాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు.. ఆధ్యాత్మిక తన్మయత్వంతో ఊరేగించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజల అనంతరం శక్తి పటాలు తమ స్వస్థలాలకు భక్తులు తీసుకెళ్లారు. దేశంలో కలకత్తా తర్వాత మచిలీపట్నంలోనే ఈ శక్తి పటాలు కనిపిస్తాయి.
ఇదీ చదవండి: