ETV Bharat / state

'లోన్​ ఇస్తామని ఫోన్ వస్తే దయచేసి నమ్మకండి'

మీకు రుణం కావాలా..? అయితే ఈ నెంబర్​కు ఫోన్ చేయండి. ఎటువంటి పత్రాలు అక్కరలేదు. మీకు ఆర్థికంగా ఎంతో సాయంగా ఉంటుంది. వడ్డీ కూడా తక్కువే. ఇలాంటి ఫ్రీ అవకాశాల వైపు ఆశగా చూస్తే... జరిగేదేంటీ..?

cyber crime in vijayawada
cyber crime in vijayawada
author img

By

Published : Feb 11, 2020, 11:38 AM IST

బాధితుడు మహేశ్

ఆన్​లైన్​ మోసం... రోజూ పోలీసులు హెచ్చరించే మాటే. అయినా ఓ వ్యక్తి 12 లక్షల రుణం అనగానే నమ్మి మోసపోయాడు. మోసగాళ్లు రుణం ఇవ్వలేదు సరికదా... బాధితుడి నుంచే విడతలవారీగా నగదు వసూలు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన మహేశ్ తాపీమేస్త్రీ. గతేడాది నవంబర్​లో అతడి చరవాణికి ఓ సందేశం వచ్చింది. మీకు లోన్ కావాలంటే ఫలానా నెంబర్​కు ఫోన్ చేయండి అనేది అందులోని సారాంశం. మహేశ్ వెంటనే సదరు నెంబర్​కు ఫోన్ చేశాడు. ఆధార్​, చిరునామా తదితర వివరాలు అడగ్గానే చెప్పేశాడు.

కాసేపటికే.. మహేశ్​కు నిందితుడు ఫోన్ చేసి రూ.12 లక్షల రుణం మంజూరైందని తెలిపాడు. ఆన్​లైన్​లో స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ కాపీ పంపారు. ఈ క్రమంలోనే మహేశ్​ను మాయమాటలతో బుట్టలో పడేశారు. రిజిస్ట్రేషన్​, ఇన్​కంటాక్స్​ పేర్లతో విడతల వారీగా 27 వేల రూపాయలను దోచేశారు.

తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. బాధితుడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడి బ్యాంక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడి ఖాతాలో ఉన్న నగదును సీజ్ చేసి బాధితుడికి అప్పజెప్పారు.

ఆన్​లైన్​లో రుణాలు ఇస్తామంటే నమ్మొద్దని బాధితుడు చెప్పాడు. లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎస్సై మోసం చేశాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు యువతి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.