కృష్ణా జిల్లాలో కొవిడ్ వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని 13 ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. సదరు ఆస్పత్రులపై సుమారు 56 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎల్. శివ శంకర్ తెలిపారు. విజయవాడ నగరంలో కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ, విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు జేసి వెల్లడించారు.
వాటిపై రూ.6 లక్షల చొప్పున ఫైన్..
ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీసి నిబంధనలు అతిక్రమించి, రోగుల వద్ద నుంచి అధిక వసూళ్లుకు పాల్పడిన 11 ఆస్పత్రులపై మే 15 వరకు 44 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు. మే 22న విజయవాడలో చేపట్టిన తనిఖీల్లో స్మైల్ హాస్పిటల్ రూ. 6 లక్షలు, ఈవీఆర్ హెల్త్ హాస్పిటల్‌పై రూ.6 లక్షలు పెనాల్టీ వేశామన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56 లక్షలు జరిమానాను విధించామన్నారు.
కొన్నింటికి అనుమతులు రద్దు..
ఆస్పత్రులకు పెనాల్టీ విధించటంతో పాటుగా కొన్నింటికి కొవిడ్‌కు చికిత్స చేసే అనుమతులు రద్దు చేసినట్లు జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా.వై బాల సుబ్రహ్మణ్యం వివరించారు.
ఇవీ చూడండి : పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి సురేశ్