ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు

కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపై పడకుండా అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు.. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు వసతి గృహాలు సహా విద్యాలయాలన్నీ మూసివేయాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

holidays
holidays
author img

By

Published : Mar 19, 2020, 3:07 AM IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు
కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వసతి గృహాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు సహా శిక్షణ కేంద్రాలను నేటి నుంచి ఈ నెల 31 వరకు మూసివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ ముందు జాగ్రత్త చర్యలపై ఆమె వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 10 మందికి మించి ప్రజలు ఒక చోట గుమిగూడకుండా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మనిషి మనిషికీ కనీసం ఒక మీటర్‌ దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు సంస్థలు.... వారి సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని సీఎస్‌ స్పష్టం చేశారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు, రైతుబజార్‌లు, మార్కెట్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల నిరంతరం శానిటైజేషన్ ప్రోటోకాల్‌ జాగ్రత్తలు పాటించాలని సీఎస్‌ నీలంసాహ్ని సూచించారు. దుకాణాలు, దుకాణ సముదాయాల్లో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకునేలా ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఆదేశాలు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న 15 రోజులు అత్యంత కీలకమైనవిగా భావించి... ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు సభలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని.... ఒకవేశ నిర్వహించాల్సి వస్తే... వీడియో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులు కనీసం 14 రోజుల పాటు కుటుంబసభ్యులు సహా ఎవరితో కలవకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎంవో ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్‌ సూచించారు. 14 రోజుల వరకు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం లేనందున ప్రజలు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలను మూసివేయడంతో పాటు.... క్రీడాపోటీలు, కార్యకలాపాలన్నింటినీ వాయిదా వేయాలని.... వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ 88 శాతం పూర్తైందని తెలిపారు.

ఇవీ చదవండి: కశ్మీర్​లో డ్రోన్​ కలకలం.. బీఎస్​ఎఫ్​ సిబ్బంది కాల్పులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.