భూస్వాములు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని సీపీఎం నేత రఘ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నందివాడ మండలం పరిధిలో 125 ఎకరాలు పేద, దళితుల భూములను భూస్వాములు అక్రమించారని ఆరోపించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని గత 15 ఏళ్లుగా పోరాడుతుంటే... ప్రభుత్వాలు పట్టించుకోలేదని వివరించారు.
ఇదీ చదవండి :