ETV Bharat / state

'మహిళా ఆర్థికమంత్రి ఉన్నా దేశంలో... మహిళలకు ఒరిగిందేమీలేదు'

author img

By

Published : Nov 8, 2019, 10:13 PM IST

దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని... వీటిని తగ్గించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యంగాస్త్రాలు సంధించారు. నోట్లరద్దు మహిళల సాధికారత అంశంపై ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్
మహిళా ఆర్ధికమంత్రి ఉన్నా దేశంలో... ఇప్పటికీ మహిళలకు ఒరిగిందేమిలేదు

భారతదేశం నేరమయ దేశంగా మారుతోందని ..మహిళలపై దాడులు పెరుగుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఎద్దేవా చేశారు. మహిళల సాధికారతపై ఆమె మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే మహిళలపై నేరాలు పెరిగాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, స్వామీజీలపై అత్యాచార కేసులు నమోదు కావటం సిగ్గుచేటని.. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతకు అద్దంపడుతుందన్నారు. ఇప్పటికీ నేరాల సంఖ్య 3.46 లక్షలకు చేరుకుందని.. 1000కి పైగా నేరాలు10 ఏళ్లలోపు చిన్నారుల పైనే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఆర్థికమంత్రి ఉన్నా దేశంలో ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి పథకం నిలిపివేయటంతో 60 శాతం మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు .ఆర్ఎస్ఎస్ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నందు వల్లే ...ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ బిల్లును తీసుకురాలేదని వ్యాఖ్యానించారు.. ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుపై శ్రద్ధ చూపాలని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు .

ఇదీచూడండి.నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.