పేదలు నివాసముంటున్న ప్రాంతంలోనే నివేశన స్ధలాలు కేటాయించాలని.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో సీపీఎం నేత చిగురుపాటి బాబురావు ఆందోళన చేశారు. నగరంలోనే ఖాళీ స్ధలాలు ఉండగా.. సూదూర ప్రాంతంలో ఇళ్ల స్ధలాలు కేటాయించటం దారుణమన్నారు. పేదలను నగరానికి దూరంగా పంపి.. విలువైన భూములు బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకాని పెడతారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన గృహాలను స్ధానిక పేదలకు కేటాయించకపోవడాన్ని ఆయన ఖండించారు.
ఇదీచదవండి: ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి: చంద్రబాబు