విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఒకవైపు చెబుతూ.. అదనపు సెక్యూరిటీ డిపాజిట్ 3 వేల రూపాయలు చెల్లించాలని నోటీసులు జారీ చేయటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వరకు వేచి ఉండి... ఎన్నికల ముగిసిన కొద్దిగంటల్లోనే నోటీసులు జారీ చేయడం ప్రజలను మోసగించడం కాదా అని ఆయన నిలదీశారు. ఒకవైపు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమౌతుంటే.. మరోవైపు పేద ప్రజలకు వేల రూపాయలు చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు జారీచేయటం అమానుషమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం షరతులకు లొంగిపోయి ప్రజల నెత్తిన భారాలు మోపారని.. ప్రజలు వీటిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విజయవాడ 62వ డివిజన్ ప్రకాష్ నగర్‌లో పర్యటించి విద్యుత్ శాఖ ఇచ్చిన నోటీసులను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో ఆందోళన నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి.
ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ.. ఇకపై కరోనా వ్యాక్సినేషన్