ETV Bharat / state

'కరోనా పరీక్షలను వేగవంతం చెయ్యండి'

పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ... కరోనా పరీక్షలు తగ్గుముఖం పడుతున్నాయని సీపీఎం నేత సీహెచ్​ బాబురావు ఆరోపించారు. విజయవాడలోని శాంతినగర్​, కండ్రిక 61, 64 డివిజన్లలో పర్యటించిన ఆయన... పరీక్షలను వేగవంతం చెయ్యాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : May 8, 2020, 6:11 PM IST

విజయవాడలోని శాంతినగర్​, కండ్రికలో పర్యటించిన సీపీఎం నేత బాబురావు

కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని సీపీఎం నేత సీహెచ్​ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ శాంతినగర్, కండ్రిక 61, 64 డివిజన్లలో ఆయన పర్యటించారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండగా... కరోనా పరీక్షలు తగ్గుతున్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు వచ్చిన కుటుంబసభ్యులకు పరీక్షలు చేయటంలేదనీ ఆరోపించారు. ఆ ప్రాంతంలోని ప్రజలు కోరుతున్నా సరే పరీక్షలు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. శాంపిల్స్ సేకరించినా... తుదినివేదికలు రావటంలో జాప్యం జరుగుతుందన్నారు. అవసరమైన వారిని క్వారంటైన్​కు పంపిచడం లేదని ఆరోపించారు.

చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయటంలో జాప్యం జరగడం వల్ల బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రెడ్​జోన్​ ఏరియాలో మరణించిన వారి దహన సంస్కారాలకు భౌతికకాయాన్ని అందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని చెప్పారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి వాహనాలు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కరోనా కలవరపెడుతున్నా... కనీస స్పృహ కరవు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.