కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కోడూరు మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. గిట్టుబాటు ధరలపై కేంద్రం చట్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా, తెదేపా, భాజపాలు రైతులను ద్రోహం చేశాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. దిల్లీలో రైతుల ఆందోళన చూస్తుంటే..అప్పట్లో నాయకులు బ్రిటిష్ వారితో పోరాడిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు అరికట్టాలని నాయకులు పేర్కొన్నారు. అంతకుముందు గంగానమ్మ గుడి సెంటర్ నుంచి రామారావు స్తూపం సభా ప్రాంగణం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: జాగ్రత్తగా మాట్లాడు.. పవన్‌కు మంత్రుల హెచ్చరిక