స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయం.. సరైనదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నామినేషన్ ప్రక్రియ నుంచి మెుదలుపెట్టి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఎస్ఈసీకి సహకరించాలన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను రద్దు చేసి మళ్లీ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన ఈసీని కోరారు.
ఇదీ చదవండి: