లాక్డౌన్ కారణంగా తీవ్రఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆదుకోవాలని కోరుతూ... సీపీఐ నారాయణ ముఖ్యమంత్రి జగన్‌కి లేఖ రాశారు. ఫొటోగ్రఫీని వృత్తిగా నమ్ముకున్న వారికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. 3 నెలలుగా ఆర్థికంగా వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక అల్లాడుతున్న ఫొటో, వీడియో గ్రాఫర్లను ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 9,712 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ