ETV Bharat / state

'రెడ్​జోన్​లో నిత్యావసరాల పంపిణీ మాటలకే పరిమితం'

కూరగాయలు, పళ్ల పంపిణీని ప్రముఖ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోలకు అప్పగించడాన్ని సీపీఐ నేత బాబురావు తప్పుబట్టారు. విజయవాడలో పర్యటించిన ఆయన.. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : May 5, 2020, 11:35 PM IST

CPI leaders  protest Against government rules in vijayawada
విజయవాడలో సీపీఎం నేతల ఆందోళన

రాష్ట్రంలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టి స్విగ్గి, జొమాటో లాంటి కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని... సీపీఎం నేత సీ.హెచ్.బాబూరావు తప్పుబట్టారు. విజయవాడ 61వ డివిజన్ శాంతినగర్​లో ఆయన పర్యటించారు. మద్యం దుకాణాల వద్ద పేద వర్గాలు బారులు తీరడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

పళ్ళు, కూరగాయలు పంపిణీని స్విగ్గి, జొమాటో కంపెనీలకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్​జోన్​లోని ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, పాలు పంపిణీ చేస్తామన్న అధికారుల ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ప్రజలకు సరిపోవడం లేదని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

మచిలీపట్నంలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.