ఏపీలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై పునరాలోచించటం తగదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలకు చేరువలో ఉన్నాయన్న ఆయన....ప్రతిరోజు ఏపీలో 8 వేల నుంచి 10 వేలకు పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయన్నారు.
విపత్కర పరిస్థితుల్లో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించటం సరికాదని హితవుపలికారు. విద్యాశాఖ మంత్రికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణయ్యిందని, అమెరికాలో పాఠశాలలు తెరిచిన 15 రోజుల్లో లక్ష మంది పిల్లలకు కరోనా సోకడం గమనార్హమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతిచ్చి కరోనా వ్యాప్తికి కారణమైందని దుయ్యబట్టారు. కరోనా పూర్తిగా నివారించబడేవరకైనా లేదా వ్యాక్సిన్ వచ్చే వరకైనా పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయటం మంచిదన్నారు.
ఇదీ చూడండి