లాక్ డౌన్ తో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో... పాల ధర పెంపు పై ప్రభుత్వ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఖండించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచవద్దని, పెంచితే చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం పాల ధరలు ఎందుకు పెంచుతుందో సమాధానం చెప్పాలని బాబూరావు డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాల వినియోగం తగ్గింది, పాల ధర పెంచితే వినియోగం ఇంకా తగ్గుతుందని అన్నారు. ప్రజలలో రోగనిరోధక శక్తి తగ్గి ప్రజారోగ్యం మరింత క్షీణిస్తుందని... ముఖ్యమంత్రి, ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే పాలధర పెంపుని రద్దు చేయాలని కోరారు.
ఇదీ చూడండి కరోనా విజృంభన.. కార్మికనగర్‌లో కఠిన ఆంక్షలు