ETV Bharat / state

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభం - కరోనా వ్యాక్సిన్ న్యూస్

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై-రన్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం కోసం... 5 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. డ్రైరన్‌కు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచారు.

నేడు కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

author img

By

Published : Dec 28, 2020, 5:55 AM IST

Updated : Dec 28, 2020, 9:08 AM IST

నేడు కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

కృష్ణా జిల్లాలో నేడు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై-రన్‌ మొదలుకానుంది. ఈ మేరకు విజయవాడ జీజీహెచ్​, తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, ప్రకాష్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పూర్ణ ఇనిస్టిట్యూట్, ఉప్పులూరు పీహెచ్​సీల్లో.. వ్యాక్సినేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో వైద్యాధికారులు, ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు.

వ్యాక్సిన్ కోసం వచ్చేవారు ప్రవేశ మార్గంలో మహిళా పోలీసుకు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ కేంద్రం లోపలికి వెళ్లగానే మూడు గదులు ఉంటాయి. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడోది అబ్జర్వేషన్ గది ఉంటుంది.

విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని... డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యాక్సిన్ డ్రై-రన్‌ కార్యక్రమం ఇవాళ, రేపు కొనసాగనుంది.

ఇదీ చదవండి:

'చెత్త'ఘటనపై ప్రభుత్వం చర్యలు.. మున్సిపల్ కమిషనర్​పై‌ సస్పెన్షన్ వేటు‌

Last Updated : Dec 28, 2020, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.