ETV Bharat / state

ఆస్పత్రి భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం - కృష్ణా జిల్లా నేర వార్తలు

కరోనా పాజిటివ్​గా తేలటంతో.. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన వైద్యులు బాధితురాలిని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

covid positive women get to suicide with mental problems in vijayawada
ఆస్పత్రి భవనం పై నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 1, 2020, 12:05 AM IST

కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ఆదిలక్ష్మికి కొవిడ్ పాజిటివ్​గా తేలటంతో.. విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు.. నెగెటివ్​గా తేలింది. ఫలితంగా బాధితురాలిని డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అయితే.. భర్త ఇంటికి తీసుకువెళతాడో లేదోననే అనుమానం, గత కొద్ది నెలల క్రితమే కుమారుడు మృతి చెందటంతో మానసిక ఆందోళనకు గురైన బాధితురాలు.. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది మహిళను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీచదవండి

మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.