కరోనా సోకిన వారు ఎటువంటి ఆందోళన చెందకుండా.. కరోనా దీక్ష చేపట్టాలని భారత కొవిడ్ నివారణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ గంగాధరరావు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మాట్లాడారు. కరోనా సోకిన వారిని అంటరాని వారిగా చూస్తున్నారని.. ఇది చాలా అమానవీయ చర్యగా ఖండించారు . బహుళ అంతస్తుల్లో ఉన్నవారు.. ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. దీనిపై అవగాహన పెంచాలని గంగాధరరావు సూచించారు.
కరోనా వైరస్ వచ్చిన రోగులు తగిన అవగాహనతో ఉంటే మళ్లీ మామూలు మనుషులుగా కోలుకుంటారని డాక్టర్ గంగాధర్ వివరించారు. దేవుళ్లకు చేస్తున్నట్లుగా.. పది రోజులు కరోనా దీక్ష చేస్తే వైరస్ జయించవచ్చని డాక్టర్ గంగాధరరావు సూచించారు. కరోనా వచ్చిన వారి పట్ల మానవత్వంతో ఉండాలని.. ఇంటి యజమానులకు ఆయన సూచించారు.
ఇదీ చదవండి; గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం