ETV Bharat / state

మచిలీపట్నంలో నేటి నుంచి మరింత కఠినంగా లాక్​డౌన్ అమలు

మచిలీపట్నంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడుతున్నాయి. దీంతో పట్టణంలో లాక్​డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తామని ఆర్డీవో వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో రహదారిపైకి వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.

author img

By

Published : Jun 18, 2020, 12:15 PM IST

corona cases in machilipatnam
మచిలీపట్నంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లాక్​డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు ఆర్డీవో ఖాజావలి ప్రకటించారు. నేటి నుంచి మచిలీపట్నంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఉన్నట్లు స్పష్టం చేశారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించారు. ఈ సమయంలో రహదారిపైకి ఎవరు వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మచిలీపట్టణం డివిజన్​లో 54 కరోనా పాజిటివ్ కేసుల్లో మచిలీపట్నం నియోజకవర్గంలోనే అత్యధికంగా 40 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేషన్​ పరిధిలో 29, రూరల్​లో 11 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. బుధవారం ఒక్క రోజులోనే 13 కేసులు నమోదు అవ్వగా... మచిలీపట్నం రూరల్ మాలకాయలంకలో 4, ఉల్లిపాలెంలో 2, మంగినపూడిలో 1, నిజాంపేటలో 3, సర్కారుతోటలో 2, జవ్వారుపేటలో 1 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అప్పుడు మెతక వైఖరి వల్లే..ఇప్పుడు మన మీదకి దూసుకొచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.