కృష్ణాజిల్లా నూజివీడులో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొవిడ్ టెస్టులు చేస్తూ.. కరోనా కిట్లు అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 954 కిట్లు స్వాధీనం చేసుకున్నారు.
నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తిరువూరు బస్టాండ్ వద్ద ఉన్న వెంకటసాయిదుర్గ ఫ్యాన్సీ స్టోర్లో అనధికారికంగా కొవిడ్ కిట్లు అమ్ముతున్నారు. అలానే కొత్తపేటకు చెందిన సుధీర్ కుమార్ అనే ప్రైవేట్ టెక్నీషియన్ ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కో టెస్టుకు రూ. 3వేలు చొప్పున వసూలు చేస్తున్నాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ కిట్లు హైదరాబాద్కు చెందిన పొట్లూరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనధికారికంగా వీరికి సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసి అతన్నుంచి 954 కిట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..