కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. ఈ మేరకు మోపిదేవి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో కరోనా అనుమానం ఉన్న వందలాదిమందిని పరీక్షించారు.
వైద్యసిబ్బంది కోవిడ్-19 పరీక్షలు చేశారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన ముగ్గురు జర్నలిస్టులు సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల తరువాత వివరాలు తెలియజేస్తామని వైద్యశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
నిర్లక్ష్యమా.. యంత్రాంగ వైఫల్యమా.. వి'శోక' విపత్తుకు కారణాలేంటి..?