రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దిల్లీ వెళ్లి వచ్చినవారే బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. దిల్లీ వెళ్లి వచ్చిన 52 మందితో పాటు వారు కలిసిన 45 మందిని గుర్తించిన విజయవాడ అధికారులు.. అందరినీ క్వారంటైన్లో ఉంచారు. ఇలాంటివారు మరింత మంది ఉన్నారని అనుమానిస్తున్న అధికారులు.. వారిని గుర్తించేందుకు మరిన్ని చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.
ప్రజలు నిత్యావసరాలు తీసుకునే సమయం కూడా 11 గంటల వరకే కుదించి స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ రహదారులను మూసేసి జనసమూహం లేకుండా కట్టడి చేశారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందడి ఉండే బీసెంట్ రోడ్డు, బెంజి సర్కిల్, ఏలూరు రోడ్డు ప్రాంతాలు ఈసారి నిర్మానుషంగా మారాయి. నిర్వాహకులు ఎక్కడికక్కడ స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తూ ఇళ్ల వద్దే పండుగను చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: