ETV Bharat / state

ఆవాసం.. పోషకాహారం.. సిద్ధం చేసిన అధికార యంత్రాంగం - latest news of corona news in krishna dst

కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకొంటున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రెడ్‌ జోన్‌లు, హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు మూడో దశ సర్వే చేపట్టారు. క్వారంటైన్‌ శిబిరాల్లో ఉండే వారికి వసతులతో పాటు బలవర్థకమైన ఆహారం అందించేలా చూస్తున్నారు.

corona news in krishna dst
పౌష్టికాహారాన్ని పరిశీలిస్తున్న ముడ వీసీ
author img

By

Published : Apr 11, 2020, 2:28 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ శిబిరాల్లో వైద్య సిబ్బందితో రోజూ పరీక్షలు నిర్వహించడమే కాక.. అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. మచిలీపట్నంతో పాటు పెడన, గన్నవరం, విజయవాడ, గుడివాడ, నూజివీడులలో 32 క్వారంటైన్‌ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 కేంద్రాల్లో అనుమానితులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు 14 రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. జిల్లా వ్యాప్తంగా 35 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 20 మందిని శిబిరాల్లో నిర్వహించిన పరీక్షల్లోనే అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించడం లేదనే విమర్శలొస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వసతులతో పాటు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించారు.

బలవర్థకమైన ఆహారం పంపిణీ

ప్రభుత్వంతో పాటు దాతల సహకారంతో క్వారంటైన్‌లో ఉన్నవారికి భోజన వసతి, నిత్యావసరాలు అందించేలా కార్యాచరణ రూపొందించారు. ఉదయం పూట ఆల్పాహారం, భోజనంతో పాటు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్‌మిస్‌, ఎండు ఖర్జూరం, అరటిపండు, కోడి గుడ్డు అందించేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచే పలు కేంద్రాల్లో ఈ బలవర్థకమైన ఆహారాన్ని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ల పట్ల అపోహలు వీడాలని అధికారులు కోరతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నప్పటికీ బహిర్గతం చేయకుండా కొందరు దాచేందుకు ప్రయత్నిస్తున్నారని, దాని వల్ల వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అధికారులు కోరుతున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి సర్వే నిర్వహిస్తున్నందున వారికి సమాచారం అందించడంతో పాటు అనుమానిత లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో చేరాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

రోగ నిరోధక శక్తి పెంపే లక్ష్యం

  • క్వారంటైన్‌లో ఉండేవారికి రోగ నిరోధక శక్తి పెంపొందించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు బలవర్థకమైన ఆహారం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా క్వారంటైన్​ ఇన్​ఛార్జీ విల్సన్​బాబు తెలిపారు. రెండు పూటలా కాఫీ, టీ అందిస్తున్నామన్నారు. పౌష్టికాహారంతో త్వరితగతిన కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనీ.. శిబిరంలో ఉండే వారు ఈ ఆహారాన్ని తీసుకోవాలని కోరుతున్నట్లు సూచించారు.

కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ వివరాలు

జిల్లాలో క్వారంటైన్‌ శిబిరాలు 32

లక్షణాలున్నవారు ఉన్న శిబిరాలు 16

క్వారంటైన్‌ శిబిరాలలో చేరినవారు 593

హోం క్వారంటైన్‌కు వెళ్లినవారు 137

ఇదీ చూడండి:

శుభ్రత పాటించండి.. పండంటి బిడ్డకు జన్మనివ్వండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.