పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లాలోని కుంచనపల్లి బైపాస్, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు.
13 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు పీఈటీలు కోరారు. హోర్టింగ్ ఎక్కిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు మా సంఘానికే ఉంది: కేఈ ప్రభాకర్