కృష్ణా జిల్లాలోని మున్నేరు ఆనకట్టను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. 20 వేల ఎకరాలకు సాగునీరందించే ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆనకట్ట వద్ద నీటి నిల్వకు అవసరమైన కరకట్టల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రాంత రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా మిలిగిపోయిన ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నుంచి పట్టణ కాలువకు సాగునీరు విడుదల చేశారు.
ఇదీచదవండి