ETV Bharat / state

'స్వచ్ఛందంగా ముందుకు రండి.. త్వరగా కోలుకుంటారు' - విజయవాడలో కరోనా సొకిన యువకుడు

కరోనా లక్షణాలున్న వారు ముందుకు వచ్చి వైద్య సహాయం పొందడం ద్వారా కోలుకోవచ్చని వైరస్‌ బారిన పడిన విజయవాడకు చెందిన యువకుడు పేర్కొన్నాడు. పారిస్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన అతడికి కరోనా వైరస్‌ సోకింది. 10 రోజులుగా చికిత్స పొందుతున్న అతడు.. ఇప్పుడు కోలుకుంటున్నాడు.

krishna district
'స్వచ్ఛందగా ముందుకు రండి.. కోలుకుంటారు'
author img

By

Published : Apr 2, 2020, 3:21 PM IST

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యం చేయించుకుంటే కోలుకుంటామని పేర్కొన్నాడు విజయవాడలో కరోనా సొకిన యువకుడు. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అతడు ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడాడు.

కరోనా వచ్చినంత మాత్రాన చనిపోతారనే భయం అవసరం లేదని, కచ్చితంగా కోలుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయని చెప్పాడు. అందుకు తానే నిదర్శనమని తెలిపాడు. అందుకే.. కరోనా లక్షణాలు ఉన్న వారు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి అధికారులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. అప్పుడే తమ కుటుంబాలతో పాటు సమాజానికి సైతం మేలు చేసినవారవుతారని హితవు పలికాడు.

తాను మరో 2,3 రోజుల్లో ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుకోబోతున్నట్టు ఆనందం వ్యక్తం చేశాడు.తనకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించిన కారణంగానే కోలుకున్నానని, తాజాగా రెండుసార్లు వైద్య పరీక్షలు చేయగా.. కరోనా నెగెటివ్‌ నివేదిక వచ్చిందని తెలిపాడు. మరోసారి వైద్య పరీక్షలు చేశాక.. తనను ఇంటికి పంపిస్తారని వెల్లడించాడు.

మార్చి 16న ఈ యువకుడు పారిస్‌ నుంచి దిల్లీ, అక్కడి నుంచి హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు 17న చేరుకున్నాడు. 18 నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. 21న ఇతడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇతను ఇంటిలో 4 రోజులు ఉన్నా.. సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో కుటుంబసభ్యులకు వైరస్‌ సోకలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.