కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని జిల్లా కలెక్టరు ఇంతియాజ్ స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తి తగ్గిందని మాస్కూలు ధరించకుండా భౌతిక దూరం పాటించకుంటే తగు మూల్యం చెల్లించవలసి ఉంటుందన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గటంతో పాటు ప్రస్తుతం సింగిల్ డిజిట్ లోనే కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వ్యాపార కూడళ్లు, కార్పోరేట్ కళాశాలల్లో , సినిమాహాల్స్లో రద్దీ పెరిగినా భౌతిక దూరం పాటించడం లేదని.. ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
మొదటి దశలో హెల్త్ వర్కర్లకు, రెండో దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. మూడో దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, మిగిలిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 60 శాతం హెల్త్ వర్కర్లు, 35 శాతం ఫ్రంట్ లైన్ వర్కర్స్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: