ETV Bharat / state

గ్రామాల్లో కరోనా ఉద్ధృతి... ఐసోలేషన్​ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం - Collector Intiaz updates

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్​ తెలిపారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను అదేశించారు.

collector-intiaz
కలెక్టర్ ఇంతియాజ్ సమావేశం
author img

By

Published : May 25, 2021, 8:08 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతి సౌకర్యాలతో గ్రామ స్థాయి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కంకిపాడు మండలం పునాదిపాడులో గ్రామ స్థాయి అధికారులతో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, కొవిడ్ అవగాహన కార్యక్రమాల నిర్వహణ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో మే మొదటి వారంలో పట్టణ ప్రాంతాల్లో 55 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 45 శాతం కరోనా కేసులు నమోదు కాగా... ప్రస్తుత వారంలో పట్టణ ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం కేసులు నమోదయ్యాని కలెక్టర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్, పాఠశాల తదితర ఏదైనా భవనాన్ని గుర్తించాలన్నారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇదీ చదవండి

స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.