రాష్ట్రంలో కొత్త కలెక్టరేట్ల ఏర్పాటుకు కావల్సిన భూముల అందుబాటుపై సమాచారం ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ కోరింది. అన్ని రకాల ఉద్యోగాలకు మానవవనరుల అవసరాలపైన అధ్యయనం చేయాలని సీఎఫ్ఎంఎకు బాధ్యత అప్పగించింది. అదనంగా కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలనే సూచనలు వస్తే ఏం చేయాలనే దానిపైనా సిద్ధం కావాలని జిల్లా అధికారులకు సూచించింది. పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలో కొత్త జిల్లాలో ఏర్పాటు చేసినపుడు జరిగిన పరిణామాలు, వివరాలను సేకరించాలని సీఎఫ్ఎంఎస్ను ఆదేశించింది. భౌగోళిక సరిహద్దుల వివరాలూ సేకరిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నందున దీనికి ఎలాంటి అవరోధం కలగకుండా కొత్త జిల్లాల ఏర్పాట్లు చూడాలని కమిటీ భావిస్తోంది.
ఇదీ చూడండి. ఒక్క రూపాయి డాక్టర్ జిజియా.. ఇక లేరు