ETV Bharat / state

Polavaram guide bund damaged : కుంగిపోయిన పోలవరం గైడ్​బండ్.. బాధ్యులెవరు..? భవిష్యత్ ఏమిటి? - గోదావరి నది

Polavaram guide bund damaged : పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన గైడ్‌బండ్‌ కుంగిపోవడాన్ని.. నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ వైఫల్యంగానే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. ప్రవాహ వేగం ఒకవైపే పడకుండా నియంత్రించడం, ప్రాజెక్టు స్పిల్‌వే రక్షణకు కీలకమైన గైడ్‌బండ్‌ ఆకృతులు రూపొందించి, నిర్మించింది మేఘా సంస్థేనని గుర్తుచేస్తున్నారు. రూ. 81 కోట్లు వెచ్చించిన నిర్మాణం కుంగిపోతే... కాంట్రాక్ట్ కంపెనీని వెనుకేసుకొస్తూ కుంగిపోవడం చిన్న సమస్యమేనని సీఎం అనడం దారుణమంటున్నారు. ఎందుకు కుంగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా... పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదించామని, వాళ్లే తేలుస్తారని చేతులు దులుపుకోవడం కూడా సరికాదంటున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 9, 2023, 7:22 AM IST

కుంగిపోయిన పోలవరం గైడ్ బండ్

Polavaram guide bund damaged : పోలవరం ప్రాజెక్టులో రూ.81 కోట్లు వెచ్చించి నిర్మించిన గైడ్‌బండ్‌ ఏడాదైనా కాకుండానే కుంగిపోయింది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు, జలాశయంలో నీటి నిల్వకు వీలుగా నిర్మించిన స్పిల్‌వే రక్షణ కోసం గైడ్‌బండ్‌ కట్టారు. గోదావరికి భారీ వరదొచ్చినప్పుడు ప్రవాహ వేగం వల్ల స్పిల్‌వేలో ఒకవైపే ఒత్తిడి పెరగకుండా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ కం గైడ్‌ బండ్‌... కుంగిపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడటం ఇంజినీరింగ్‌ వర్గాలను విస్మయపరుస్తోంది. గైడ్‌బండ్‌ నిర్మాణానికి డిజైన్‌లోనే లోపం ఉండాలని లేదా డిజైన్‌కు తగ్గట్టుగా నిర్మించకపోవడమైనా అయ్యుండాలని అంటున్నారు. గైడ్‌బండ్‌ డిజైన్‌ రూపకల్పన, దాని ప్రకారం నిర్మాణం మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీనే చేసినందున... లోపమేదైనా ఆ సంస్థదే అవుతుందంటున్నారు.

కుంగిన గైడ్‌బండ్‌ స్థానంలో మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతుంటే.. సీఎం జగన్‌ మాత్రం ఇదో చిన్న అంశమని తేల్చిపారేయడం విస్మయం కలిగిస్తోంది. బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం... గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తులా చూపించే దౌర్భగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే పనులు చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్నచిన్న సమస్యలు వస్తాయని... వాటిని గమనించుకుంటూ, మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకొచ్చారు. కీలక స్పిల్‌వే రక్షణకు ఉద్దేశించిన కట్టడం కుంగిపోతే... చిన్న సమస్యగా సీఎం పరిగణించడం గమనార్హం. సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.

భిన్నమైన ప్రాజెక్టు నిర్మాణం... సీఎం జగన్‌ అన్నట్లు గైడ్‌బండ్‌ చిన్న పనో లేదా చిన్న కట్టడం కాదని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టు కీలక నిర్మాణాల్లో ఇదొకటని... పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే భిన్నమైనదని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌వేతో పాటు, గోదావరి సహజ మార్గంలో 44 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించారు. దీంతో నది సహజమార్గం నుంచి అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌వే వైపుగా వరద మళ్లుతోంది. ప్రవాహ తీరును పరిశీలించిన పరిశోధన సంస్థలు... స్పిల్‌వేలో ఎడమ ఫ్లాంకు వైపునకు నీటివేగం ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఇక్కడ సుడిగుండాలు ఏర్పడి ప్రతికూల ప్రభావం చూపవచ్చని గుర్తించారు. దీన్ని నిరోధించేందుకు పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధన సంస్థ నిపుణులు ప్రాజెక్టు త్రీడీ నమూనా రూపొందించి అధ్యయనం చేశారు. స్పిల్‌వే ఎడమ వైపున వరద సమయంలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయని, ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో ప్రవాహం ఉందని గుర్తించారు.

స్పిల్‌వే మధ్యలో వేగం సెకనుకు 9.2 మీటర్లుగా ఉండటం ప్రమాదకరమని తేల్చారు. ఇక్కడ ప్రతికూలత లేకుండా వరద సాఫీగా సాగిపోయేందుకు పలు సిఫార్సులు చేశారు. గోదావరిని మళ్లించే అప్రోచ్‌ ఛానల్‌ మౌత్‌ వద్ద 450 మీటర్ల వెడల్పు తవ్విన మార్గాన్ని 550 నుంచి 660 మీటర్ల వరకు పెంచాలన్నారు. స్పిల్‌వే ఎడమ వైపునకు ఎగువన, అప్రోచ్‌ ఛానల్‌ ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్‌బండ్‌ నిర్మించాలని సూచించారు. గైడ్‌బండ్‌ నిర్మిస్తే స్పిల్‌వే ఎడమ ఫ్లాంక్‌ వైపు భారీ సుడిగుండాలు నివారించవచ్చని, ప్రవాహ వేగం తగ్గుతుందని పరిశోధనల్లో తేలినట్లు కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం నివేదికల్లో పేర్కొంది. గైడ్‌బండ్‌ నిర్మించి అప్రోచ్‌ ఛానల్‌లో మార్పులు చేస్తే వరద వేగం ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 4 మీటర్లు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని తేల్చారు. అంటే.. పోలవరంలో స్పిల్‌వే రక్షణకు గైడ్‌బండే కీలక నిర్మాణం. అందుకే ఈ నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు వెచ్చించారు.

1.5మీటర్ల మందంతో డయా ఫ్రం వాల్ నిర్మాణం... గైడ్‌బండ్‌పై కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రం సిఫార్సుల తర్వాత... మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ ఆకృతులు సిద్ధం చేయించింది. సీడబ్ల్యూసీ ఆమోదంతో నిర్మాణం చేపట్టింది. వరద ప్రవాహం వైపున 1.5 మీటర్ల మందంతో ఆర్సీసీ డయాఫ్రం వాల్‌ నిర్మించారు. మైనస్‌ 5 మీటర్ల నుంచి +25 మీటర్ల ఎత్తు వరకు దీనిని కట్టడం నిర్మించారు. అంటే 500 మీటర్ల పొడవున నది ప్రవాహం ఉండే వైపున... భూగర్భంలో నుంచి ఎగువన 25 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. ఆపైన +23.68 మీటర్ల స్థాయి నుంచి +51.32 మీటర్ల వరకు రాళ్లతో గైడ్‌బండ్‌ పూర్తిచేశారు. దిగువన 117.28 మీటర్లు, ఎగువన 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. డిజైన్లకు ముందు భూభౌతిక పరిస్థితులతో పాటు నిర్మాణ సమయంలో చేసిన పరీక్షలన్నింటిలో అంచనాల మేరకే ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఐనా ఎందుకు కుంగిందో అధికారులు నోరు మెదపడం లేదు.

కారణం ఏమిటో తేల్చడం లేదు.. పోలవరం పురోగతిని సమీక్షంచడంలో, అధికారులను అప్రమత్తం చేయడంలో సీఎం జగన్‌ పాత్ర అంతంత మాత్రమే. ప్రాజెక్టుపై అరుదుగా సమీక్షలు జరుగుతుండగా... అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. గైడ్‌బండ్‌ కుంగిన ప్రాంతానికి బయటివారిని వెళ్లనివ్వడం లేదు. గైడ్‌బండ్‌ ఎందుకు దెబ్బతిందో అధికారులూ చెప్పడం లేదు. డిజైన్‌లోనో, నిర్మాణంలోనో లోపం ఉండొచ్చని అనడం ద్వారా... జరిగిన నష్టాన్ని ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తున్నారు. అంతా సరిగ్గానే చేశాం, ఒక్కోసారి ఇలా జరుగుతుందని పైకి చెబుతున్నారు.

పోలవరం అథారిటీకి, కేంద్ర జలసంఘానికి తెలియజేశామని.. రెండు మూడు రోజుల్లో నిపుణులు వచ్చి తేలుస్తారని దాటవేస్తున్నారు. గైడ్‌బండ్, రిటైనింగ్‌ వాల్‌ తరహా నిర్మాణానికి చేసిన ఖర్చు రూ.81 కోట్లు. రెండూ కుంగినందున గైడ్‌బండ్‌ను సరిదిద్దితే సరిపోతుందా అన్నది ఇంజినీరింగ్‌ అధికారులు తేల్చడం లేదు. రిటైనింగ్‌ వాల్‌ ఎంత మేర దెబ్బతింది, రాతిబండ పరిస్థితేంటన్నది అధ్యయనం చేయాలని అంటున్నారు. మరమ్మతులతో సరిదిద్దవచ్చన్న నమ్మకం లేని అధికారులు... మళ్లీ మొత్తం కట్టాలంటే వ్యయప్రయాసలు పెరుగుతాయని చెబుతున్నారు.

ఇంజినీర్ల అనుమానాలు.. గైడ్‌బండ్‌ కుంగిన తీరుమీద పోలవరంపై అనుభవమున్న ఇంజినీర్ల పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి డిజైన్‌ పరంగా, నిర్మాణ నాణ్యత పరంగా తలెత్తిన లోపాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఓ విశ్రాంత సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ చెప్పారు. నిర్మించిన చోట మట్టి సాంద్రతను పెంచేందుకు చేసిన పనుల్లో లోపం ఉండొచ్చని.... స్టోన్‌ కాలమ్స్‌తో చేసిన పనుల్లోనూ లోపాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి తీసుకున్న లోతు సరిపోయి ఉండకపోవచ్చని... భూమిలో మైనస్ 5 మీటర్ల లోతు నుంచి నిర్మించడం చాలకపోయి ఉండొచ్చని చెప్పారు.

రాక్‌ఫిల్‌ డ్యాంలో ఉపయోగించిన రాళ్ల నాణ్యతపైనా అనుమానాలు ఉన్నాయని... రాళ్లు ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చాలన్నారు. మట్టి పరిశోధన ఫలితానికి అనుగుణంగానే నిర్మాణం సాగిందా అన్నదీ చూడాలన్నారు. డిజైన్‌పైనే అనుమానాలు ఉన్నాయని మరో కీలక ఇంజినీరింగ్‌ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నల్లరేగడి నేలలతో కూడి ఉండటం ఈ తరహా నిర్మాణానికి అనువైంది కాదన్నారు. ఈ విషయాన్ని గుర్తించామని డిజైన్‌ విభాగం అధికారులు తొలుత చెప్పారని.. సీడబ్ల్యూసీ ఆమోదం పొందడంతో ఆ విషయం విస్మరించారని తెలిపారు. డిజైన్‌ సమర్పించిన తర్వాత సీడబ్ల్యూసీ వద్ద చాలా త్వరగా అనుమతులు వచ్చాయన్న చర్చ జరుగుతోందన్నారు.

అంతా సవ్యంగానే చేశామని అధికారులు చెబుతున్నా... రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణ శైలి మార్చుకుని ఉండాల్సిందని మరో విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్ అన్నారు. సాధారణంగా ప్రీ-స్టోన్‌ స్లోప్‌ 2:1 నిష్పత్తిలో సాగిందని... అలా కాకుండా 3:1 తరహాలో చేపట్టి ఉంటే వాలుపై కొంత భారం తగ్గి ఉండేదన్నారు. గేబియన్ల తరహా నిర్మాణం సరిపోయి ఉండేది కదా అని ప్రశ్నించగా.. స్పిల్‌ ఛానల్‌కు కుడి వైపున ఇలా గేబియన్‌ తరహా కట్టల నిర్మాణానికే డ్యాం డిజైన్‌ కమిటీ ఆమోదించిందన్నారు. అలా నిర్మించే అవకాశమూ ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.