విజయవాడ(vijayawada)లోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(Narla Tataravu Thermal Power Station) లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. కోల్స్టాక్ యార్డులో ప్రస్తుతం బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి(Coal reserves are empty). బొగ్గు వ్యాగన్లు వస్తే కానీ యూనిట్లు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఉద్యోగులు తెలిపారు. బొగ్గు నిల్వలు లేకపోవటంతో ఏడు యూనిట్లకు ఐదింటిలో మాత్రమే విద్యుదుత్పత్తిని చేసున్నట్లు అధికారులు తెలిపారు. 1760 మెగవాట్లకు 950 మెగవాట్ల విద్యుత్‌ను అధికారులు ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్ పవర్ స్టేషన్‌కు రోజుకు 7 యూనిట్లకు 21 వేల టన్నుల బొగ్గునిల్వలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి