ETV Bharat / state

ఇవాళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం - కొలువుదీరిన

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారికి సీఎం జగన్ నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

సీఎం జగన్
author img

By

Published : Oct 3, 2019, 7:39 PM IST

Updated : Oct 4, 2019, 5:38 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముందుగా ఈ నెల 5న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నా... దిల్లీ పర్యటన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. ముఖ్యమంత్రి ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి పట్టువస్త్రాలు సమర్పించి తిరిగి వెళ్లే వరకు 300 రూపాయల క్యూలైన్లు నిలిపివేస్తున్నట్లు డీసీపీ విజయరావు వెల్లడించారు. పోలీసులు చేపట్టే భద్రతా చర్యలకు భక్తులు సహకరించాలని కోరారు.

Intro:FILE NAME : AP_ONG_43_03_PLASTIC_NASHADAM_VINUTNA_PRAYATNAM_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్లాస్టిక్ తీసుకురండి... నచ్చిన బహుమతులు తీసుకెళ్లండి... ప్లాస్టిక్ నిషేధంపై ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘం అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు... ప్లాస్టిక్ ను నిషేధించకపోతే పర్యవరణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక పాలిథిన్ సంచి భూమిలో పూర్తిగా కరిగిపోవాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. అదే గ్లాసు, నీళ్ల సీసా ఆయితే 450 ఏళ్ళు పడుతుంది.. అందుకే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించేందుకు చీరాలలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో గాంధీ జయంతి నుండి ఒక అంగడి ప్రారంభించారు... అక్కడ కూరగాయలు, పండ్లు, వివిధ రకాల వస్తువులను ఉంచారు.. వాటిని తీసుకెళ్లాలంటే డబ్బులు ఇవ్వనవసరం లేదు.. ప్లాస్టిక్ వ్యర్ధాలు తెచ్చిస్తే చాలు... వినియోగదారులు తెచ్చినవి తుకంవేసి ఆమేరకు వారు కొరిన వస్తువులు ఇస్తున్నారు.. ప్రజల్లో కూడా మంచి స్పందన లభించింది... నిన్నటినుండి ఇప్పటివరకు 200 కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థలను సేకరించామని, పాలిథిన్ క్యారిబ్యాగుల వాడకం నియంత్రణలోకి వచ్చే వరకు ఈ అంగడి కొనసాగిస్తామని చీరాల మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి తెలిపారు... చీరాల పురపాలక అధికారులు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి పట్టణ ప్రజలు మద్ధతునిస్తున్నారు.

Body:బైట్ : 1 : కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్, చీరాల.
బైట్ : 2 : బషీర్ , పారిశుధ్య పర్యవేక్షకుడు, చీరాల.
బైట్ : 3 : డి. వెంకటేశ్వర్లు, స్థానికుడు, చీరాల.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Oct 4, 2019, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.