CM Jagan's review with senior officials : పరిశ్రమల స్థాపన మొదలుకుని మార్కెటింగ్ వరకు ప్రోత్సహించేలా నూతన పాలసీ రూపొందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా నూతన పాలసీని ఉండాలన్నారు. పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్థికశాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. అంతర్జాతీయంగా మార్కెంటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందన్న సీఎం.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్నారు. కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలన్నారు. అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలన్నారు.
స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి... స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం ఆదేశించారు. మంచి ప్రదేశంలో భవనాన్ని నిర్మించాలని, ఆ భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండాలన్నారు. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం... పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టి సారించాలన్నారు. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.
ముంబైలో రోడ్ షో.. ఇక మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుండగా.. పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన ముంబైలో రోడ్ షో జరిగింది. రాష్ట్ర మంత్రులు బుగ్గన, అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ సహా పరిశ్రమల శాఖ అధికారులు హాజరై.. నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు పారిశ్రామికవేత్తలకు వివరించారు.
21 రోజుల్లోనే అనుమతులు.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, వనరులు, 21 రోజుల్లోనే అనుమతులు.. తదితర అంశాలను ఈ సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని విశాఖపట్నం నగరంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇవీ చదవండి :