ETV Bharat / state

గన్నవరం వైకాపాలో ముదిరిన విభేదాలు.. అధిష్టానం వద్దకు నేతల పంచాయితీ - గన్నవరం వైకాపా వార్తలు

గన్నవరం వైకాపాలో వర్గవిభేదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేసేది లేదని... వైకాపా సీనియర్ దుట్టా రామచంద్రరావు తేల్చిచెప్పారు. ఇరు వర్గాలను అధిష్టానం పిలిచి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. వైకాపా కార్యకర్తలను వంశీ తొక్కేస్తున్నారని బహిరంగంగానే దుట్టా విమర్శలు గుప్పించారు. దుట్టా వర్గం సహకరించడం లేదని వంశీ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో మరోసారి భేటీ కావాలని అధిష్టానం నిర్ణయించింది.

వైకాపా
వైకాపా
author img

By

Published : May 20, 2022, 5:21 AM IST

గన్నవరం వైకాపాలో ముదిరిన విభేదాలు.. అధిష్టానం వద్దకు నేతల పంచాయితీ

గన్నవరం అధికార వైకాపాలో వర్గవిభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. కృష్ణా జిల్లా గన్నవరం నేతల పంచాయితీ... అధిష్టానం వద్దకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో... ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇరువురితో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గన్నవరం వైకాపా ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే వంశీ ఉండగా... ఆయన్ను మార్చాలని దుట్టా రామచంద్రరావు పట్టుబడుతున్నారు. దీనిపై ఈ నెల 10న చలో తాడేపల్లికి పిలుపునివ్వడానికి కారణాలను సజ్జలకు వివరించినట్లు తెలిసింది.

తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన వంశీ.... పార్టీ సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లడం లేదని దుట్టా వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారిని అణిచివేస్తున్నారని రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వారికే వంశీ ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. వంశీ తీరుతో స్థానిక నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆయన తీరుతో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న దుట్టా.... గన్నవరం ఇన్‌ఛార్జి పోస్టు నుంచి వంశీని మార్చాల్సిందేనని పట్టుబట్టారు.
గన్నవరం నియోజకవర్గ పరిణామాలను సజ్జలకు వంశీ వివరించారు. దుట్టా వర్గం నుంచి ఎదురవుతోన్న సమస్యలను తెలియజేశారు. వీలైనంతవరకు దుట్టా వర్గంతో సమన్వయం చేసుకుని వెళ్లాలని అధిష్టానం పెద్దలు వంశీకి సూచించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:" NTR 30: కత్తి పట్టుకుని మాస్​లుక్​లో ఎన్టీఆర్​.. ఫ్యాన్స్​కు పూనకాలే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.