కృష్ణా జిల్లా నూజివీడు మండలం తండా, సిద్ధార్థ నగర్ గ్రామాల్లో జరిగిన వివాదం.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడడంలో ఇద్దరు విద్యార్ధులకు తలెత్తిన గొడవ మాత్రమేనని,రెండు గ్రామాల మధ్య వివాదం కాదని సీఐ వెంకట నారాయణ స్పష్టం చేశారు. ఓడిన వారిని గెలిచినవారు హేళన చేయడంతో అవమానంగా భావించిన వారు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇరు గ్రామాల ప్రజలు కేసులు పెట్టేందుకు ఇష్టపడలేదని, ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇవీ చదవండి: విద్యార్థుల మధ్య మొదలై... రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి