CLASH BETWEEN TWO VILLAGES: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని 2 గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. పురుషోత్తపట్నం, కొండపావులూరు గ్రామాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో.. పురుషోత్తపట్నానికి చెందిన ఓ యువకుడు సరిహద్దు వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొడవకు కారణమైంది. వేడుకల సందర్భంగా ఇరుగ్రామాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: CBN on NTR oath day : ఆ ఘనత సాధించిన.. ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు