తమకు బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. విజయవాడ వన్ టౌన్ నెహ్రూ కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. నెలలు తరబడి తమకు వేతనాలు చెల్లించకుండా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినా.. తమకి ఏడు నెలల వేతనం పెండింగ్‌లో పెట్టారని వారు వాపోయారు.
వైకాపా అధికారంలోకి రాగానే కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను క్రమబద్ధికరిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశారని సీఐటీయూ సంఘం నాయకులు మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో కార్పొరేషన్ అధికారులు ఆడుకుంటున్నారని అన్నారు. వెంటనే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అధికారులను కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: