రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం 500 మంది కార్మికులను విధుల నుంచి తొలగించటం పట్ల సీఐటీయూ నిరసన వ్యక్తం చేసింది. కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్ణయాన్ని నిరసిస్తూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు భంగం కలిగే విధంగా.. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం నడుచుకుంటోందని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని... తొలగించిన కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తీసుకున్న కాసేపటికే... వైద్యురాలికి అస్వస్థత!