పోలీసులు అంటే కేవలం రక్షణ కల్పించడమే కాదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటున్న పోలీసు అధికారులు.. తమదైన శైలిలో సామాన్యుల సైతం సాయం చేస్తారు. ఈ తరహా ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మద్యం సేవించి నడిరోడ్డుపై స్పృహ లేకుండా పడిఉన్న ఓ వ్యక్తిని క్షేమంగా ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేసి మానవత్వం(CI Bhimaraju show humanity at Machilipatnam) చాటుకున్నారు ఓ సీఐ సీఐ రుద్రరాజు భీమరాజు.
మచిలీపట్నం బస్టాండ్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి మద్యం సేవించి నడిరోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఇవాళ ఉదయం విధి నిర్వహణలో భాగంగా ఆ మార్గంలో వెళ్తున్న రాబర్ట్సొన్ పేట సీఐ రుద్రరాజు భీమరాజు.. తన వాహనం ఆపి రోడ్డుపై పడిఉన్న వ్యక్తి వద్దకు వెళ్లారు. అతని పరిస్థితిని గుర్తించిన సీఐ.. మొఖంపై నీళ్లు చల్లి లేపి తానే స్వయంగా రోడ్డు దాటించి పక్కన కూర్చొబెట్టారు. వివరాలు తెలుసుకొని అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఖాకీలు అంటే కర్కశత్వమే అనే నానుడి నిజం కాదని.. తమకు మనసు ఉంటుందని చేతల్లో చేసి చూపుతున్న ఇలాంటి పోలీస్ అధికారులు.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు(police humanity at machilipatnam).
ఇదీ చదవండి..