కొవిడ్ కారణంగా బాధ పడుతున్న తల్లిదండ్రులకు.. తమ బిడ్డల సంరక్షణ చూసుకునేవారు లేరనే బాధను తగ్గించేందుకు కృష్ణా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తల్లి పాజిటివ్ అయి.. బిడ్డకు నెగటివ్‌గా ఉంటే.. ఆ చిన్నారులకు కేర్ అండ్ షేర్ సంస్థలో ఉంచి, భోజనం, వసతి ఏర్పాట్లు చేసేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ నోయల్ ముందుకు వచ్చారు. కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేసే అధికారులు, వైద్యులు.. ఇలాంటివి సంఘటనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ బి.వి.ఎస్.కుమార్ తెలిపారు. అవసరమైన వారు 99850 17899, 98488 86361, 85200 01063, 94904 91831, 83319 34401 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
- పిల్లలకు ‘విద్యార్థి’ సంరక్షణ
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులను విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న మాజేటి ప్రహ్లాదరావు ఛారిటీ.. విద్యార్థి సంస్థను నిర్వహిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వసతి గృహాల్లో ఉండే పిల్లలంతా తమ సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో హాస్టలు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో కొవిడ్-19 కారణంగా పెద్దలు క్వారంటైన్‌లో ఉంటే పిల్లల సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సంస్థ నిర్వాహకులు మాజేటి మాధవి, సురేంద్రనాథ్‌ల దృష్టికి వచ్చింది. అటువంటి వారికి తమ సంస్థ ద్వారా ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. పెద్దల క్వారంటైన్ గడువు పూర్తయ్యే వరకు పిల్లలకు తిండి, వసతి అవసరాలకు ఈ సంస్థ ఉచితంగా సమకూరుస్తుంది. ఈ అవకాశాన్ని విజయవాడ నగరంతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించుకోవచ్ఛు పటమటలోని అంబేడ్కర్ నగర్‌లో ఉన్న విద్యార్థి సంస్థ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్ఛు లేదా 93465 82838 నంబర్‌కు ఫోన్ చేసి చెబితే సేవలు అందిస్తారు.
ఇదీ చదవండి: హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం